
ఓటు చోర్‌పై నేటి నుంచి సంతకాల సేకరణ
నల్లగొండ: బీజేపీ ఓటు చోర్‌పై జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి కాంగ్రెస్ ఆధ్యర్యంలో సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. గురువారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటు చోర్‌పై ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ మాత్రం కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అక్కడ ఓటు చోర్‌కి పాల్పడుతుందని పేర్కొన్నారు. బీజేపీ ఓటు చోర్‌పై అన్ని గ్రామాలు, మండల, నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాలు, అభిప్రాయ సేకరణ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.