
మద్యం టెండర్లకు నోటిఫికేషన్
దరఖాస్తుల స్వీకరణకు
మూడు చోట్ల కౌంటర్లు
ఒక్కరు ఎన్ని దుకాణాలకై నా టెండర్లు వేయవచ్చు
నల్లగొండ: రెండేళ్ల పాటు కొత్త మద్యం దుకాణాల కేటాయింపునకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో జిల్లా కలెక్టర్ మద్యం షాపులను కేటాయించనున్నారు. జిల్లాలో 154 మద్యం దుకాణాలు ఉండగా నూతన మద్యం పాలసీ ప్రకారం రిజర్వేషన్ పద్ధతిన ఎస్సీలకు 14, ఎస్టీలకు 4, గౌడలకు 34 షాపులను కేటాయించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు సమక్షంలో గురువారం కలెక్టరేట్‌లో డ్రా తీశారు. ఎవరికి ఏయే షాపులు అనేది శుక్రవారం ప్రకటించనున్నారు.
నేటి నుంచి దరఖాస్తులు
నూతన మద్యం దుకాణాలకు ఈనెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలను జిల్లా కలెక్టర్ కేటాయించనున్నారు.
రెండేళ్ల పాటు దుకాణాలకు లైసెన్స్
కొత్త మద్యం దుకాణాలకు రెండేళ్ల పాటు లైసెన్స్‌లు ఇవ్వనున్నారు. డ్రాలో దుకాణాలు దక్కించుకున్న వారంతా డిసెంబర్ 1 నుంచి వాటిని తెరవాల్సి ఉంటుంది. అప్పటి నుంచి 2027 నవంబర్ 30వ తేదీ వరకు లైసెన్స్ కాల పరిమితి గడువు ఉండనుంది.
ఈ సారి పెరిగిన టెండర్ ఫీజు
టెండర్‌లో పాల్గొనేవారు రూ.3 లక్షలు టెండర్ దరఖాస్తు కింద చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.2 లక్షలు ఉన్న దరఖాస్తు రుసుమును ప్రభుత్వం రూ.3 లక్షలకు పెంచింది. ఎన్ని దుకాణాలకు టెండర్లు వేస్తే ఒక్కోదానికి రూ.3 లక్షల చొప్పున డీడీ చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ మూడు చోట్ల ఉండనుంది. నల్లగొండలోని రామగిరిలో గల ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం, ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో, హైదరాబాద్ నాంపల్లిలోని ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
ఫ రెండేళ్ల కాల పరిమితికి విడుదల చేసిన ప్రభుత్వం
ఫ నేటి నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఫ అక్టోబర్ 23 డ్రా పద్ధతిన దుకాణాల కేటాయింపు
ఫ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రకటించిన కలెక్టర్
ఫ ఈ సారి టెండర్ ఫీజు రూ.3లక్షలు
ఫ డిసెంబర్ 1న ప్రారంభించనున్న కొత్త వైన్స్
కొత్త మద్యం దుకాణాల కోసం ఒక్కొక్కరు ఎన్నింటికై నా టెండర్లు వేసుకోవచ్చు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రాలో ఒక్కరికే ఎన్ని దుకాణాలు వెళ్లినా కేటాయించబడతాయి. నల్లగొండలో 2 చోట్ల, హైదరాబాద్‌లో నాంపల్లి కమిషనర్ కార్యాలయంలో టెండర్ల స్వీకరణ ఉంటుంది. హైదరాబాద్‌లో ఉండేవారు అక్కడే టెండర్ దాఖలు చేయవచ్చు.
–బి.సంతోష్, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్

మద్యం టెండర్లకు నోటిఫికేషన్