
యూరియా కష్టాలు తీర్చాలని రాస్తారోకో
అడవిదేవులపల్లి : యూరియా కష్టాలు తొలగించాలని కోరుతూ గురువారం అడవిదేవులపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు స్థానిక మిర్యాలగూడ ప్రధాన రోడ్డుపై చెట్టు కొమ్మలు అడ్డంగా వేసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కొన్ని రోజులుగా యూరియా కోసం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్దకు వస్తున్నా అందరికీ దొరకడం లేదని వాపోయారు. ఇప్పటికై నా మండల రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
టోకెన్ల కోసం తెల్లవారుజామునుంచే బారులు
త్రిపురారం : రైతులను యూరియా కష్టాలు వీడడం లేదు. వరిపైరుకు యూరియా వేసే అదును దాటిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం త్రిపురారం పీఏసీఎస్‌కు యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు టోకెన్ల కోసం స్థానిక రైతు వేదిక వద్ద ఉదయం 4 గంటల నుంచే క్యూకట్టారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సమక్షంలో టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం యూరియా పంపిణీ చేయగా అందని చాలా మంది రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.
త్రిపురారం : రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం బారులుదీరిన రైతులు
అడవిదేవులపల్లి : రాస్తారోకో చేస్తున్న రైతులు

యూరియా కష్టాలు తీర్చాలని రాస్తారోకో