
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
నల్లగొండ: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 37 మంది వినతిపత్రాలు సమర్పించారు. ఈసందర్భంగా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ బాధితులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సంబంధిత ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్టపరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని పేర్కొన్నారు.
కాలనీల్లో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్
నల్లగొండ: దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ సంబరాల్లో మహిళలు, యువతులపై వేధింపులు, ఈవ్ టీజింగ్ చేయకుండా పోలీస్ నిఘా పెట్టామని పేర్కొన్నారు. జిల్లాలో 200 దుర్గాదేవి విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు. మండపాల వద్ద అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేసిన కాలనీల్లో నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మండపాల వద్ద అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాత్రి సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాత్రి 10 గంటలలోపు స్పీకర్లు బంద్ చేయాలని సూచించారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్