
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
నల్లగొండ: గ్రీవెన్స్‌డే సందర్భంగా సోమవారం ప్రజలు పెద్దఎత్తున కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. భూ సమస్యలు, పెన్షన్లు, ఇతర సమస్యలపై మొత్తం 72 వినతులు అదనపు కలెక్టర్ శ్రీనివాస్ స్వీకరించారు.
ఫ 72 వినతులు సమర్పించిన అర్జీదారులు
తమ భూమిని బ్లాక్ లిస్టులో చేర్చారని, అందులో నుంచి తొలగించాలని నల్లగొండ మండలం, చందనపల్లి గ్రామానికి చెందిన గాదె రాజారాంరెడ్డి కలెక్టరేట్‌ను ఆశ్రయించాడు. తనకు నలుగురు కుమార్తెలు ఉన్నారని, తన భార్య చాలా ఏళ్ల క్రితమే చనిపోయిందని తెలిపాడు. తనకున్న భూమిలో తన మూడో కుమార్తెకు 4.13 ఎకరాల భూమిని గతంలో అమ్మానని, ఇంకా 2 ఎకరాల 34 కుంటల భూమి తన పేరుతో ఉందని పేర్కొన్నాడు. మిగతా కుమార్తెలు తాను అమ్మిన భూమిని బ్లాక్ లిస్టులో పెట్టడంతోపాటు, తన పేరున ఉన్న భూమిని కూడా బ్లాక్ లిస్టులో పెట్టారని, దానిని తొలగించాలని విన్నవించాడు.
దేవరకొండలోని సర్వే నంబర్ 405లో దర్గా భూములు ఆక్రమించుకుంటున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని దేవరకొండకు చెందిన దర్గా హక్కుదారులు సయ్యద్ సిద్దిక్ అలీ, కాదర్, అంజద్‌అలీ, ఉస్మాన్ అలీ, సాబేర్, బషీర్, ఫయాజ్‌లు కలెక్టరేట్‌ను ఆశ్రయించారు. నిర్మాణం చేసే వారిని ఆపమంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని, వక్ఫ్ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని వినతిపత్రం అందజేశారు.

గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ

గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ