
లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వాలి
నల్లగొండ టౌన్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డబుల్‌బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల సాధన పోరాట కమిటీ కన్వీనర్ అవుట రవీందర్ డిమాండ్ చేశారు. సోమవారం డబుల్ బెడ్‌రూమ్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద వంటావార్పు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాటరీ ద్వారా ఎంపికై న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని ఆందోళన చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొన్నిరోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉన్నందున వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో గంజి నాగరాజు, సిరాజుద్దీన్, విశాలాక్షి, ప్రశాంతి, గిరిజ, రాజేష్, విజయలక్ష్మి, అనురాధ, జహంగీర్, రవి, సుల్తాన్, ఇలియాస్, వెంకటమ్మ, రజని, యాదమ్మ పాల్గొన్నారు.