
జీజీహెచ్‌లో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
నల్లగొండ టౌన్ : నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) ఐసీయూ విభాగంలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ కె.భార్గవ్‌ను విధుల నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకు జీతాలు రాలేదని ప్రజావాణిలో తనకు దరఖాస్తు సమర్పించగా విచారణ చేసినట్లు పేర్కొన్నారు. ఆల్ఫా స్వయం శక్తి సంఘం కాంట్రాక్ట్ పీరియడ్ ఈ సంవత్సరం మార్చి 31తో ముగిసిందని, అయితే 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త ఏజెన్సీకి కేటాయించడం, అదే ఏజెన్సీని రెన్యువల్ చేసే విషయమై సీనియర్ అసిస్టెంట్ కె.బార్గవ్ జిల్లా ఉపాధి కల్పన అధికారికి ఎలాంటి ఫైల్ సమర్పించలేదని విచారణలో తేలిందని పేర్కొన్నారు. దీంతో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం చేసిన భార్గవ్‌ను విధుల నుంచి సస్పెండ్ చేశామని తెలి పారు. క్రమశిక్షణ చర్యల ప్రక్రియ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని కలెక్టర్ వెల్లడించారు.
సాగర్‌లో పర్యాటకుల
సందడి
నాగార్జునసాగర్ : సాగర్ కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతుండటంతో ఆ అందాలను సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులతో నాగార్జునసాగర్ పరిసరాల్లో ఆదివారం సందడి నెలకొంది. కృష్ణాతీరంతో పాటు ఎత్తిపోతల, బుద్ధవనం అనుపు తదితర ప్రాంతాలను పర్యాటకులు సందర్శించారు. లాంచీల్లో నాగార్జునకొండకు వెళ్లారు. బుద్ధవనంలో ధాన్యం చేశారు.
24.2 మి.మీ సగటు
వర్షపాతం నమోదు
నల్లగొండ టౌన్ : జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 24.2 మిల్లీ మీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా కనగల్ మండలంలో 74.5 మిల్లీమీటర్లు, వేములపల్లిలో 70.5, తిప్పర్తి మండలంలో 63.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. శాలిగౌరారం 41.3 మి.మీ, నకిరేకల్ 51.5, కేతేపల్లి 40.1, నల్లగొండ 45.1, మునుగోడు 17.4, చండూరు 52.6, మర్రిగూడ 15.4, చింతపల్లి 25.1, గుర్రంపోడు 19.8, అనుముల హాలియా 14.9, త్రిపురారం 23.1, మాడ్గులపల్లి 38.4, మిర్యాలగూడ 41.1, దామరచర్ల 54.1, అడవిదేవులపల్లి 9.5, తిరుమలగిరిసాగర్ 12.7, పెద్దవూర 10.2, పీఏపల్లి 8.2, నేరడుగొమ్ము 4.8, కొండమల్లేపల్లి 6.0, దేవరకొండ 9.2, గుండ్లపల్లి 2.7, చందంపేట 4.7, గట్టుప్పల్ 14.3, గుడిపల్లిలో 8.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
నల్లగొండ : టెట్ ఉత్తీర్ణులు కావాలనే నిబంధన నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశం కోరారు. ఆదివారం నల్లగొండలోని సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన కమిటీ సమావేశంలో మాట్లాడారు. 20 నుంచి 30 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన ఉపాధ్యాయులను టెట్ ఉత్తీర్ణులు అయితేనే ఉద్యోగంలో కొనసాగుతారని లేనిపక్షంలో ఉద్యోగం నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉపసంహరించుకోవాలన్నారు. 2010 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు అప్పటి నిబంధనలే వర్తింపజేయాలన్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులకు మాత్రమే టెట్ వర్తించేలా కోర్టు తీర్పుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, ఉపాధ్యక్షులు గోపి, ఏడుకొండలు, పుష్ప, ఎం.నాగయ్య, జగతి, టి.వెంకటేశ్వర్లు, కుమారి, అంజయ్య, ఎండీ.ఖుర్షద్ మియా తదితరులు పాల్గొన్నారు.

జీజీహెచ్‌లో సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్