
కమీషన్ కష్టాలు
రేషన్ డీలర్లకు ఏప్రిల్ నెల నుంచి అందని కమీషన్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కమీషన్ విడుదల చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే దశల వారీగా జిల్లా కలెక్టర్లకు, పౌర సరఫరాల అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొంటున్నారు. అక్టోబరు 1 నుంచి సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నామని చెబున్నారు. అందులో బాగంగా ఈ నెల 23న హైదరాబాద్‌లో తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఐదుగురు సభ్యులు పాల్గొననున్నారు. ప్రభుత్వం వెంటనే కమిషన్ విడుదల చేయకపోతే 1 నుంచి సమ్మెలోకి వెళ్లాలని ఈ సమావేశంలో తీర్మాణం చేసుకుని వెళ్లనున్నట్లు సంఘ నాయకులు చెబుతున్నారు.
నల్లగొండ: రేషన్ డీలర్లకు ఆరు నెలలుగా కమీషన్ అందడం లేదు. ఏప్రిల్ నెల నుంచి ఇప్పటి వరకు సుమారు ఉమ్మడి జిలా వ్యాప్తంగా రూ.6 కోట్ల కమీషన్ డీలర్లకు అందాల్సి ఉంది. కమీషన్ ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఈ నెల 23న తెలంగాణ రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మె నిర్ణయం ప్రకటించనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి..
రేషన్ బియ్యం లబ్ధిదారులకు అందజేసినందుకు ప్రభుత్వం క్వింటాకు రూ.140 చొప్పున డీలర్‌కు కమీషన్ చెల్లిస్తుంది. ఇందులో రూ.90 కేంద్రం చెల్లిస్తుండగా.. రూ.50 రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అసలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయన్న విషయం ఇప్పటి వరకు డీలర్లకు తెలియదు. డీలర్లంతా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పని చేస్తున్నందున ప్రభుత్వం నుంచి విడుదల కావడంతో డీలర్లు కమిషన్ తీసుకునేవారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద క్వింటాకు రూ. 50 చొప్పున ఇప్పటికే విడుదల చేసింది. కానీ కేంద్రం నుంచి రావాల్సిన మిగతా రూ.90 చొప్పున కమీషన్ రాలేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వ అధికారులు మాత్రం కేంద్రం నుంచి ఎప్పుడో విడుదల చేశామని చెబుతున్నారు. దీంతో రేషన్ డీలర్లంతా తమకు వెంటనే కమీషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఫ కేంద్రం ఇవ్వలేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం
ఫ దసరా పండుగ నేపథ్యంలో వెంటనే విడుదల చేయాలని డిమాండ్
ఫ లేదంటే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సమ్మెకు వెళ్లే యోచన
ఫ 23న హైదరాబాద్‌లో సమావేశం.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటన
జిల్లా కార్డులు షాపులు
నల్లగొండ 5,28,309 991
సూర్యాపేట 3,58,778 600
యాదాద్రి 2,41,262 380