
పథకాల అమలులో తెలంగాణ నంబర్‌వన్
మహాత్మాగాంధీ ఎంబీసీ లిఫ్ట్‌గా నామకరణం
ఫ రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఫ హుజూర్‌నగర్ నియోజవర్గంలో ఎత్తిపోతల పథకాల పనుల పరిశీలన
హుజూర్‌నగర్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజూర్‌నగర్‌లోని ఎంపీడీఓ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, దివ్యాంగుల జీవన భృతి చెక్కులు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 425 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందించామన్నారు. నియోజకవర్గంలో సీఎంఆర్‌ఎఫ్ కింద ఇప్పటివరకు 3 వేల మందికి రూ 13.31 కోట్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం జూనియర్, డిగ్రీ కళాశాలలు, ఆర్‌అండ్‌బీ అతిథి గృహం, ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం, ఫణిగిరి గుట్ట వద్ద సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఐటీఐ కళాశాల, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ భవనాల నిర్మాణ పనులను పరిశాలించారు. పనుల పురోగతిపై సమీక్షంచారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఆర్‌డీఓ శ్రీనివాసులు, ఏఎంసీ చైర్‌పర్సన్ రాధిక అరుణ్ కుమార్, మాజీ ఎంపీపీ గూడెపు శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తన్నీరు మల్లిఖార్జునరావు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్‌లు, అధికారులు, నాయకులు ఆదెర్ల శ్రీనివాసరెడ్డి, అజీజ్‌పాష, ఏ.హరిబాబు, జక్కుల మల్లయ్య, కె.ఉపేందర్, కె.మహేష్ పాల్గొన్నారు.
చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద నిర్మాణంలో ఉన్న ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు మహాత్మాగాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా నామకరణం చేస్తున్నట్లు మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం ఆయన హుజూర్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. చింతలపాలెం మండలం వెల్లటూరు వద్ద ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ లిఫ్ట్, దొండపాడులో నిర్మిస్తున్న రాజీవ్‌గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు ఎంతో మేలు జరగనుందని పేర్కొన్నారు.