
పోరాట యోధుడు కొండా లక్ష్మణ్‌బాపూజీ
మిర్యాలగూడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తన తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి కొండా లక్ష్మణ్‌బాపూజీ అని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్‌తో కలిసి బాపూజీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌బాపూజీ అందించిన సేవలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.