
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
వేములపల్లి : పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం వేములపల్లి పీహెచ్‌సీని ఆమె ఆకస్మికంగా సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీహెచ్‌సీలోని వైద్యులు, ఆర్‌బీఎస్‌కే బృందాలు, అంగన్‌వాడీలు తమ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, హాస్టళ్లను సందర్శించి విద్యార్థులకు నిరంతరం ఆరోగ్య పరీక్షలను నిర్వహించాలన్నారు. గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. ఆమె వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేస రవి, మండల వైద్యాధికారి సుచరిత, ముస్తాక్‌అహ్మద్, ఎంపీడీఓ దండ జితేందర్‌రెడ్డి, తహసీల్దార్ హేమలత, శాంతాకుమారి, ఆర్‌ఐ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి