
ఎంజీయూలో 32 అంశాలకు ఆమోదం
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అధ్యక్షతన శనివారం నిర్వహించిన అకాడమిక్ సెనేట్ సమావేశంలో 32 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా డీన్ల నియామకం, పీహెచ్‌డీ ఎర్లీ సబ్మిషన్, వన్‌టైం చాన్స్ పరీక్షల నిర్వహణ, బడ్జెట్ ఆమోదం లాంటివి మొత్తంగా 32 అంశాలపై సభ్యులు చర్చించి ఆమోదించారు. సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ మహమూద్ అలీ, రిజిస్ట్రార్ అలువాల రవి, పూర్వ వీసీలు గంగాధర్, ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి, ప్రొఫెసర్ భాగ్యనారాయణ, పూర్వ రిజిస్ట్రార్లు కన్మంతరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రొఫెసర్ ధర్మానాయక్, జి.ఉపేందర్‌రెడ్డి, మద్దిలేటి, ప్రేమ్‌సాగర్ తదితరులు పాల్గొన్నారు.