
కుంభకోణాలకు కేరాఫ్.. కాంగ్రెస్ పార్టీ
మిర్యాలగూడ టౌన్ : కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఆరోపించారు. శనివారం మిర్యాలగూడలోని బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. దామరచర్ల మండలం యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో కాపర్ అమ్ముకొని రూ.200 కోట్లు, యూరియాను దారిమల్లించి రూ.300 కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాధినేని శ్రీనివాస్‌రావు, కనపర్తి సత్యప్రసాద్, బంటు సైదులు, సజ్జల నాగిరెడ్డి, కన్మంతరెడ్డి అశోక్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, జువ్వాది సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి