
నాణ్యమైన విద్యనందించాలి
మాడుగులపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం మాడుగులపల్లి మండలంలోని కుక్కడం గ్రామంలోని కేజీబీవీని ఆమె ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని, చదువులో వెనుకబడిన గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. దసరా సెలవులు రావడంతో తమ సొంతూళ్లకు వెళ్తున్న విద్యార్థినులు, వారి తల్లులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఓ వసంత, సిబ్బంది సునీత తదితరులు ఉన్నారు.