పత్తి కొనుగోలుకు 24 కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

పత్తి కొనుగోలుకు 24 కేంద్రాలు

Sep 21 2025 5:51 AM | Updated on Sep 21 2025 5:51 AM

పత్తి కొనుగోలుకు 24 కేంద్రాలు

పత్తి కొనుగోలుకు 24 కేంద్రాలు

నల్లగొండ అగ్రికల్చర్‌ : కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లకు మార్కెటింగ్‌శాఖ సన్నద్ధమవుతోంది. జిన్నింగ్‌ మిల్లులు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోనే కొనుగోలు కేంద్రాలను తెరిచేలా చర్యలు తీసుకుంటున్నారు. గతేడాది మాదిరిగానే జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాలు ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. తొలకరి వర్షాలకు విత్తిన పత్తి చేతికొస్తోంది. ఈ నేపథ్యంలో అక్టోబర్‌లో సీసీఐ కేంద్రాలు ప్రారంభించే అవకాశం ఉంది. కాగా, జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను గుర్తించిన మార్కెటింగ్‌ శాఖ అధికారులు వాటిలో ఉన్న మౌలిక వసతులపై ఇటీవల ఆరా తీశారు. జిన్నింగ్‌ మిల్లుల్లో ఉన్న సౌకర్యాలు, కంప్యూటర్లు, వేబ్రిడ్జి తదితర అంశాలపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేశారు.

ఈసారి నూతన విధానంలో..

సీసీఐకి పత్తిని అమ్ముకునే రైతులు ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన శ్రీకపాస్‌ కిసాన్‌శ్రీశ్రీ అనే యాప్‌లో ఆన్‌లైన్‌ విధానంలో తొలుత స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలి. నచ్చిన మిల్లు, నచ్చిన సమయానికి పత్తిని విక్రయించేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే కొనుగోలుకు అనుమతిస్తారు. దీని ద్వారా మిల్లుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యవసాయశాఖ అధికారుల సహకారంతోనైనా, రైతులు స్వయంగానైనా ఆన్‌లైన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ యాప్‌ వల్ల రైతులు రోజుల తరబడి నిరీక్షించకుండా నిర్దేశిత సమయానికి కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకెళ్లి విక్రయించవచ్చు. ఏ కారణం చేతనైనా నిర్ధేశించిన రోజు పత్తి తీసుకెళ్లనట్లయితే స్లాట్‌ రద్దువుతుంది. అంతేకాకుండా నిజమైన రైతులు మాత్రమే సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించే అవకాశం ఉంటుంది.

5,64,585 ఎకరాల్లో సాగు

జిల్లాలో ఈ ఏడాది 5,64,585 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. మంచి అదునైన వర్షాలు కురవడంతో పత్తి చేలు మంచి ఏపుగా పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున సగటున దిగుబడి వచ్చినా సుమారు 45 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. గతేడాది 24 సీసీఐ కేంద్రాల ద్వారాా సుమారు 30 లక్షల క్వింటాళ్ల వరకు కొనుగోలు చేశారు. ఈసారి పత్తి దిగుబడి పెరుగుతుందని.. ఆమేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉంటే రూ.8,110 మద్దతు ధర దక్కనుంది.

సీసీఐ కేంద్రాలు ఇక్కడే..

ఫ దేవరకొండ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో శివగణేష్‌ కాటన్‌ ఇండస్ట్రీస్‌ చిన్న అడిశర్లపల్లి, తిరుమల కాటన్‌ ఇండస్ట్రీ బ్రాహ్మణపల్లి, హైద్రాబాద్‌ కాటన్‌ ఇండస్ట్రీ చెన్నారం, సాంభశివ కాటన్‌, జిన్నింగ్‌ మిల్‌ చిల్కమర్రి. శ్రీ తిరుమల కాటన్‌ ఇండస్ట్రీస్‌ చిల్కమర్రి.

ఫ నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో లలితా పరమేశ్వరి కాటన్‌ ఇండస్ట్రీస్‌ కొప్పోల్‌, సత్యనారాయణ కాటన్‌ ఇండస్ట్రీస్‌ రామలింగాలగూడెం.

ఫ నకిరేకల్‌ పరిధిలో వెంకటకృష్ణ కాటన్‌ ఇండస్ట్రీస్‌ నెల్లిబండ, తైల్‌ ఫైబర్స్‌ పామనగుండ్ల, శ్రీనాత్‌ కాటన్‌ ఫైబర్స్‌ అయిటిపాముల.

ఫ చిట్యాల పరిధిలో వరలక్ష్మి కాటన్‌ లిమిటెడ్‌, కృష్ణా కాటన్‌ మిల్‌ చిట్యాల.

ఫ చండూరు పరిధిలో మంజిత్‌ ఫైబర్‌ బంగారిగడ్డ, కార్తికేయ కాటన్‌ ఇండస్ట్రీ మునుగోడు, సరళ బాలజీ కాటన్‌ ఇండస్ట్రీ మునుగోడు, శివరామ కాటన్‌ ట్రేడర్స్‌ కొంపెల్లి.

ఫ మాల్‌ వెంకటేశ్వరనగర్‌ పరిధిలో వెంకటేశ్వర కాటన్‌ ఇండస్ట్రీస్‌, లక్ష్మీ నరసింహా ఆగ్రో ఇండస్ట్రీస్‌, శ్రీ శివసాయి కాటన్‌ జిన్నింగ్‌ మిల్‌, విష్ణుసాయి కాటన్‌ ఇండస్ట్రీస్‌, హరిహర కాటన్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌, పద్మావతి కాటన్‌ ఇండస్ట్రీస్‌, ఓంసాయి కాటన్‌ ఇండస్ట్రీస్‌.

ఫ శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్‌ పరిధిలో టీఆర్‌ఆర్‌ కాటన్‌ మిల్స్‌ మాధారం.

సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటుకు

మార్కెటింగ్‌శాఖ కసరత్తు

ఫ ఈ ఏడాది 45 లక్షల క్వింటాళ్ల

దిగుబడి వస్తుందని అధికారుల అంచనా

ఫ క్వింటాకు రూ.8,110 మద్దతు ధర

ప్రకటించిన కేంద్రం

ఫ స్లాట్‌ బుకింగ్‌ విధానంలో కొనుగోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement