
మైనార్టీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఆర్థిక సాయం అందజేసేందుకు ప్రవేశపెట్టిన రేవంత్ అన్నకా సహారా – మిస్కీనో కే లియే, ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి విజయేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఫఖీర్, దుదేకుల, అట్టడుగు ముస్లిం సామాజిక తరగతికి చెందిన వారై ఉండాలని పేర్కొన్నారు. అర్హులు https://tgobmms. cgg.gov. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
ఎంపీడీఓల సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నల్లగొండ : మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) సంఘం జిల్లా కార్యకర్గాన్ని శనివారం నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో ఈసీఓ బి.శ్రీనివాసరావు సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బి.యాకూబ్‌నాయక్, ప్రధాన కార్యదర్శిగా బి.యాదగిరి, ఉపాధ్యక్షులుగా జి.జ్యోతిలక్ష్మి, కోశాధికారిగా ఎస్‌ఆర్‌కే శర్మ, కార్యవర్గ సభ్యులుగా జె.వెంకటేశ్వరరావు, నవీన్, జయలక్ష్మి ఎన్నికయ్యారు.
నేటి నుంచి పాఠశాలలకు దసరా సెలవులు
నల్లగొండ : పాఠశాలలకు విద్యా శాఖ దసరా సెలవులను ప్రకటించింది. నేటి నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు 13 రోజులు సెలవులను ఇస్తోంది. అక్టోబర్ 4వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి.
పెట్రోల్ బంకుల్లో తనిఖీలు
నల్లగొండ : నల్లగొండ పట్టణంలో గల పలు పెట్రోల్ బంకుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెట్రోల్ బంక్‌ల్లో మౌలిక సదుపాయాలు లేకపోతే నిర్వాహకులపై కేసుల నమోదు చేస్తామని హెచ్చరించారు. వినియోగదారులకు అసౌకర్యాలు కలిగిస్తే ఉపేక్షించబోమన్నారు. బంక్ యజమానులు వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులకు గురి చేసినా పౌరసరఫర శాఖ అధికారులను సంప్రదించాలన్నారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ ఎన్‌పోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్, సయ్యద్ ముబీన్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల సీజ్
పెద్దవూర : స్కూల్ బస్సు కిందపడి బాలుడు మృతి చెందిన సంఘటనలో కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశానుసారం మండల కేంద్రంలోని శాంతినికేతన్ పాఠశాలను మండల విద్యాధికారి తరి రాములు శనివారం సీజ్ చేశారు. శుక్రవారం డీఈఓ భిక్షపతి పాఠశాలలో విచారణ చేపట్టారు. విచారణ నివేదికను అనుసరించి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పాఠశాలను సీజ్ చేశారు. బస్సు డ్రైవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.