
బాధితులకు భరోసా సెంటర్ అండ : ఎస్పీ
నల్లగొండ : లైంగిక వేధింపులకు గురైన మహిళలకు భరోసా సెంటర్ అండగా ఉంటుందని ఎస్పీ శరత్‌చంద్రపవార్ అన్నారు. శుక్రవారం నల్లగొండలోని భరోసా సెంటర్‌ను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. లైంగికదాడులు, వేధింపులకు గురవుతున్న బాలికలు, మహిళల పట్ల సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించి పని చేయాలని ఆదేశించారు. పోక్సో కేసులపై బాధితులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం భరోసా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. సిబ్బంది విధులపై పూర్తి వివరాలు అడిగి.. పలు సూచనలు చేశారు. వేధింపులు, లైంగిక దాడులకు పాల్పడిన వారికి జైలు శిక్ష తప్పదన్నారు. జిల్లాలో 19 పోక్సో కేసుల్లో 20 మంది నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, మహిళా పోలీస్‌స్టేషన్ సీఐ కరుణాకర్, భరోసా సెంటర్ సిబ్బంది అంజలి, గౌస్, నళిని పాల్గొన్నారు.