బోధన అభ్యసనలో టీఎల్‌ఎం తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బోధన అభ్యసనలో టీఎల్‌ఎం తప్పనిసరి

Sep 20 2025 6:34 AM | Updated on Sep 20 2025 6:34 AM

బోధన అభ్యసనలో టీఎల్‌ఎం తప్పనిసరి

బోధన అభ్యసనలో టీఎల్‌ఎం తప్పనిసరి

నల్లగొండ : బోధన అభ్యసన ప్రక్రియలో టీఎల్‌ఎం తప్పనిసరని డీఈఓ భిక్షపతి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని డైట్‌ కళాశాలలో జిల్లాస్థాయి బోధనాభ్యాస సామగ్రి మేళా (టీఎల్‌ఎం)లో ఆయన మాట్లాడారు. టీఎల్‌ఎంతో బోధన సులభమని, ఈ ప్రక్రియ విద్యార్థులకు పాఠాలపై ఆసక్తి పెంచేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ మేళాలో సుమారు 342 మంది ఉపాధ్యాయులు పాల్గొని భాషా పాఠాలు, అక్షరమాల, పదబంధాలు, కథాచిత్రలు, గణితం, పర్యావరణం, జంతువులు, పక్షులు, సైన్స్‌ ప్రయోగాలు తదితర అంశాలతో రూపొందించిన టీఎల్‌ఎంలు ప్రదర్శించారు. ఈ మేళాలో ఉత్తమ ప్రదర్శనలు చేసిన 8 మంది ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు డీఈఓ తెలిపారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న వారికి సర్టిపికెట్లు, మెమెంటో అందజేశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్‌ రామచంద్రయ్య, డైట్‌ లెక్చరర్‌ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ డీఈఓ భిక్షపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement