
యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం
నల్లగొండ అగ్రికల్చర్: రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని జిల్లా రైతుబంధు సమితి మాజీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. గురువారం నల్లగొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముందుస్తు ప్రణాళికను రూపొందించని కారణంగా ఎరువుల కోసం రైతులు పరుగులు పెడుతున్నారన్నారు. ప్రైవేట్ దుకాణాల్లో వ్యవసాయాధికారుల సమక్షంలో యూరియా విక్రయించాలన్నారు. పంటలకు నష్టం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సమావేశంలో జిట్ట లింగయ్యయాదవ్, చల్ల ఆంజనేయులు యాదవ్ పాల్గొన్నారు.