
ప్రాణాలర్పించింది కమ్యూనిస్టులే..
ఫ సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నల్లగొండ టౌన్ : భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన సాయుధ పోరాటం చేసి ప్రాణత్యాగాలు చేసింది కమ్యూనిస్టులేనని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. సాయుధ పోరాటం వారోత్సవాల ముగింపు సందర్భంగా నల్లగొండలోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన జాతీయ జెండా ఎగురవేసి మాట్లాడారు. సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులకు పింఛన్లను ఇవ్వకుండా నిలిపివేసి అవమానపరిచిన బీజేపీ.. నేడు విమోచనం పేరుతో సభలు పెట్టడం వెనుక ఏ కుట్ర దాగిఉందో ప్రజలకు అర్థమవుతోందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గసభ్యుడు మల్లేపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి, కర్ర సైదిరెడ్డి, లెనిన్, బూడిద సురేష్, యాదయ్య, ముండ్ల ముత్యాలు, దోటి పాండరి, కోమటిరెడ్డి ప్రధుమ్మరెడ్డి, యూసుఫ్, వీరయ్య, వెంకటయ్య, రాములు, విజయరెడ్డి, విజయ, దేవేందర్, చారి, కౌసల్య తదితరులు పాల్గొన్నారు.