
నీలగిరిలో ముస్లింల ర్యాలీ
రామగిరి(నల్లగొండ) : నల్లగొండలో ఆదివారం మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హజరత్ సయ్యద్ షా లతీఫ్ ఉల్లా ఖాద్రి దర్గా మెట్ల దగ్గర నుంచి ప్రారంభమై క్లాక్‌టవర్, ఆర్పీ రోడ్డు, ఓల్డ్ సిటీ చౌరస్తా, గంజ్ ఏరియాల నుంచి తిరిగి దర్గా మెట్ల వరకు సాగింది. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో రాగి బిస్కెట్లు, పండ్లు, పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, మిలాద్ జులూస్ కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ సల్మాన్ ఖాద్రి, వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఫాజిల్, జనరల్ సెక్రటరీ సయ్యద్ ఉబేదుల్లా ఖాద్రి, అడ్వైజర్ ఎం.డీ.కలీమ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతియాజ్ హుస్సేన్, బీఆర్‌ఎస్ నాయకులు జమాల్ ఖాద్రి, అడ్వకేట్ మసియుద్దీన్, అహ్మద్ కలీం, ముజావర్ సమీ ఖాద్రి, సుఫియా ఖాద్రి, తబ రేస్ ఖాద్రి, అవేస్ ఖాద్రి, నసీర్, ఫిరోజ్, ఉమైర్ తదితరులు పాల్గొన్నారు.