ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే

Jul 8 2025 7:04 AM | Updated on Jul 8 2025 7:04 AM

ఏసీబీ

ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే

ఆయిల్‌పామ్‌ సాగుతో అధిక దిగుబడి

మంగళవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2025

ఉమ్మడి జిల్లాలో ఏడు నెలల్లో పట్టుబడిన ఏడుగురు అధికారులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు లంచావతారులుగా మారుతున్నారు. అవినీతికి పాల్పడుతూ ఉమ్మడి జిల్లాలో నెలకొకరు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. నెలవారీ వేతనాలు వస్తున్నా.. పనుల కోసం తమ వద్దకు వచ్చిన వారిని ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వారిని ఏసీబీ అధికారులు పట్టుకొని అరెస్ట్‌ చేస్తున్నప్పటికీ అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. గడిచిన రెండేళ్లలో 18 వరకు ఏసీబీ కేసులు నమోదయ్యాయి. 2024లో 11 మంది అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడుగురు ఏసీబీ వలలో చిక్కారు.

జిల్లాలో ఈ ఏడాది కేసులు ఇలా...

● తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో జనవరి 12వ తేదీన పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా కేసులో లంచం తీసుకుంటూ ఎస్‌ఐ సురేష్‌, కానిస్టేబుల్‌ నాగరాజు పట్టుబడ్డారు. ఈ కేసులో ఓ వ్యక్తి వద్ద రూ.1.40 లక్షల ముడుపులకు ఒప్పందం కుదుర్చుకొని రూ.70 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

● చౌటుప్పల్‌లో మార్చి 6వ తేదీన ట్రాన్స్‌కో ఏడీ శ్యాంప్రసాద్‌ రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ఫార్మా పరిశ్రమకు విద్యుత్‌ బకాయిలు క్లీయరెన్స్‌ ఇవ్వడంతో పాటు మీటర్‌ పునరుద్ధరణకు లంచం డిమాండ్‌ చేయగా, బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో లంచం ఇస్తుండగా పట్టుకున్నారు.

● ఏప్రిల్‌ నెలలో రేషన్‌బియ్యం అక్రమంగా తరలిస్తున్న కేసులో చింతలపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఒక వ్యక్తికి బెయిల్‌ ఇచ్చేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ అంతిరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

● సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ వైద్యుల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి రూ.16 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో మే 12వ తేదీన వారిని పట్టుకున్నారు.

● పెన్‌పహాడ్‌ మండలం నాగులపాటి అన్నారంలో పంచాయతీ కార్యదర్శి సతీష్‌కుమార్‌ ఒక వ్యక్తి నుంచి రూ.8 వేలు లంచం డిమాండ్‌ చేశాడని ఫిర్యాదు రావడంతో జూన్‌ 26న ఏసీబీ అధికారులు దాడి చేసి సతీష్‌ను పట్టుకున్నారు.

● గత నెల 28న హుజూర్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో భూభారతి కంప్యూటర్‌ ఆపరేటర్‌ (అవుట్‌సోర్సింగ్‌) విజేతారెడ్డి రూ.12 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

న్యూస్‌రీల్‌

తాజాగా పట్టుబడిన మిర్యాలగూడ సివిల్‌ సప్లయీస్‌ డీటీ

అత్యధికంగా రెవెన్యూ, పోలీస్‌, విద్యుత్‌, రిజిస్ట్రేషన్‌ శాఖల్లోనే..

కేసులు నమోదు చేస్తున్నా మారని తీరు

పీడీఎస్‌ బియ్యం రవాణా చేస్తూ పట్టుబడి సీజ్‌ అయిన లారీలను విడిపించేందుకు మిర్యాలగూడ సివిల్‌ సప్లయీస్‌ డిప్యూటీ తహసీల్దార్‌ జావెద్‌ రూ.70 వేలు డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం జావేద్‌ను అరెస్ట్‌ చేసిన ఏసీబీ అధికారులు నల్లగొండ డీఎస్‌ఓ ఆపీస్‌ కార్యాలయంలో, జావెద్‌ ఇంట్లో సోదాలు చేశారు. సోమవారం జావేద్‌ను కోర్టులో హాజరు పరచనున్నారు.

ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే1
1/2

ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే

ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే2
2/2

ఏసీబీకి చిక్కుతున్నా.. లంచాలు ఆగట్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement