
బీఆర్‌ఎస్ నేతలవి మతిభ్రమించిన మాటలు
నకిరేకల్ : రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలకు అద్భుతమైన పథకాలను అందిస్తున్నారు.. బీఆర్‌ఎస్ నేతలు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం నకిరేకల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం, మంత్రులు గురించి మాట్లాడకపోతే బీఆర్‌ఎస్ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం చేపట్టిన పథకాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినా ప్రతిపక్ష నాయకుడు ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుందే తప్ప రైతులకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్ నేతలు ఇంకా అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉమ్మడి జిల్లా పెండింగ్‌లో ప్రాజెక్టులపై సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. సమావేశఽంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, నాయకులు చామల శ్రీనివాస్, బోళ్ల వెంకట్‌రెడ్డి, నాగులంచ వేంకటేశ్వరరావు, గాజుల సుకన్య శ్రీనివాస్, పన్నాల రాఘవరెడ్డి, నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య, కోట మల్లికార్జున్, కొండ వెంకన్న, పన్నాల శ్రీనివాస్‌రెడ్డి, కందాల భిక్షంరెడ్డి, యాసారపు వెంకన్న, బాణోతు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరశం