
నేడు ఉమ్మడి జిల్లా చెస్ సెలక్షన్స్
సూర్యాపేట: సూర్యాపేటలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం ఉదయం 10గంటల నుంచి ఉమ్మడి జిల్లా అండర్–11, 17 బాలబాలికల చెస్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శి గండూరి కృపాకర్, ఎల్. సతీష్‌కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారిని హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. వివరాలకు 9394753343 నంబర్ సంప్రదించాలన్నారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు
మిర్యాలగూడ టౌన్: నల్లగొండ రైల్వే ఎస్పీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి నార్కోటిక్ డాగ్స్‌తో మిర్యాలగూడ రూరల్ పోలీసుల సహకారంంతో రైల్వే పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లోని పలు స్టాళ్లను పరిశీలించారు. ఈ తనిఖీల్లో మిర్యాలగూడ రూరల్ ఏఎస్‌ఐ ఉమాపతిరావు, రైల్వే పోలీసులు పాల్గొన్నారు.
కుమారుడిని సర్కారు బడిలో చేర్పించిన ప్రభుత్వ టీచర్
తిరుమలగిరి: తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక ఉపాధ్యాయురాలు దొంగరి ప్రశాంతి తన కుమారుడు రిషికి తిరుమలగిరిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం అడ్మిషన్ తీసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, తన కుమారుడికి నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు ఆమె తెలిపారు. ఆమె వెంట భర్త హరీష్, మండల విద్యాధికారి శాంతయ్, ప్రధానోపాధ్యాయులు అశోక్‌రెడ్డి, ఉపాధ్యాయులు కవిత, సత్యనారాయణరెడ్డి, వెంకట్రామనర్సయ్య, సౌమ్యబాయి, గిరి, వెంకటయ్య పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ మృతి
చింతపల్లి: నిచ్చెన పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. చింతపల్లి మండలం ఉమాంతలపల్లి గ్రామానికి చెందిన అరేకంటి నర్సింహ (59) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో కరెంట్ రాకపోవడంతో గురువారం నిచ్చెన సహాయంతో ఇంటి పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని కుటుంబ సభ్యులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందాడు.

నేడు ఉమ్మడి జిల్లా చెస్ సెలక్షన్స్