పెద్దవూర: పదో తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి(డీటీడీఓ) ఎస్‌పీ రాజ్‌కుమార్ అన్నారు. మంగళవారం పెద్దవూర మండల కేంద్రంతోపాటు పులిచర్ల ఎస్టీ వసతి గృహాల విద్యార్థులు, ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పెద్దవూర ఆశ్రమ పాఠశాలలో మోటివేషనల్, కెరీర్ గైడెన్స్‌పై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆ యన మాట్లాడారు. పదో తరగతి పూర్తయ్యాక ఏఏ కోర్సులు ఉంటాయి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. విద్యార్థుల ఆసక్తులు, అవసరాలు, సామర్థ్యాలు, అర్హతలను అనుసరించి భవిష్యత్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీఎంఓ డీవీ. నాయక్, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం డీ.బాలోజీ, వార్డెన్లు బాలకృష్ణ, శ్రీను, సుధాకర్, ఆర్‌పీలు రాంరెడ్డి, కృష్ణ, సురేందర్, ఉపాధ్యాయులు సంధ్యా, షాహీన్‌బేగం, శ్రీనునాయక్, రామయ్య, సైదులు, శాంతి పాల్గొన్నారు.