దర్వేశిపురం ఆలయం వద్ద నేడు వేలం | - | Sakshi
Sakshi News home page

దర్వేశిపురం ఆలయం వద్ద నేడు వేలం

Mar 17 2025 10:55 AM | Updated on Mar 17 2025 10:48 AM

కనగల్‌ : మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల రేణుకా ఎల్లమ్మ దేవస్థానం వద్ద నేడు టెండర్‌ కం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తలనీలాల సేకరణకు రూ.3,00,000, వాహనాలకు బొట్టు పెట్టుకునే హక్కులకు రూ.2,00,000, కొబ్బరి చిప్పల సేకరణకు రూ.10,00,000, చీరెలు–వడిబియ్యం సేకరణకు రూ.1,00,000 ఏదైనా జాతీయ బ్యాంకులో ఏపీజీవీబీ నల్లగొండ రామగిరి బ్రాంచిలో చెల్లుబాటు అయ్యేలా డీడీ తీసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలంలో పాల్గొనాలని సూచించారు.

నేడు, రేపు

జాతీయ సెమినార్‌

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ పట్టణంలోని కేఎన్‌ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమ, మంగళవారాల్లో జాతీయ సదస్సు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రిసెర్చ్‌ (ఐసీఎస్‌ఎస్‌ఆర్‌) ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ‘గ్రోత్‌ పొటెన్షియాలిటీస్‌ ఇన్‌ తెలంగాణ స్టేట్‌ ప్రాస్పెక్ట్‌ అండ్‌ చాలెంజెస్‌’ అనే అంశంపై వక్తలు ప్రసంగించనున్నారు. ఈ సదస్సులో తెలంగాణ హైయ్యర్‌ ఎడ్యుకేషనల్‌ వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఈ.పురుషోత్తం, ప్రొఫెసర్లు జి.యాదగిరి, ఎం.రాములు, ముత్యంరెడ్డి, ఇంద్రకాంత్‌, పున్నయ్య, కొప్పుల అంజిరెడ్డి, వాసుదేవశర్మ ప్రసంగించనున్నారు. చివరి రోజున ఐసీఎస్‌ఎస్‌ఆర్‌ డైరెక్టర్‌ బి.సుధాకర్‌రెడ్డి సందేశంతో సెమినార్‌ ముగియనుంది.

పాఠశాలలో యోగా

శిక్షణ ఇవ్వాలి

రామగిరి (నల్లగొండ) : ప్రతి పాఠశాలలో విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని తెలంగాణ యోగా టీచర్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (టీవైటీసీసీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.రవికిషోర్‌ కోరారు. ఆదివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి యోగా టీచర్ల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పాఠశాలలో విద్యార్థి దశ నుంచే యోగా అలవాటయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలన్నారు. అందుకోసం ప్రతి పాఠశాలలో యోగా శిక్షకులను నియమించాలన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా నూతన కమిటీని నియమించారు. చైర్మన్‌గా కోలా సైదులు, గౌరవ అధ్యక్షుడిగా పోలిశెట్టి లక్ష్మయ్య, అధ్యక్షుడిగా చాడ పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆచార్య శివ, సెక్రటరీలుగా బొడ్డుపల్లి సైదులు, దుబ్బ సైదయ్య, ఉపాధ్యక్షులుగా వేల్పుల సుధాకర్‌, కొందుటి రాచయ్య, సిలివేరు సైదులు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు నల్లెడ సుదర్శన్‌రెడ్డి, గట్టుపల్లి సుష్మ, తూర్పునూరు సంధ్య, కోశాధికారిగా సింగు రామ్‌బాబు, సహాయ కోశాధికారిగా బిసు కరుణాకర్‌, గోరంట్ల శ్రీనివాస్‌, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా కోట్ల సైదులు, పున్న వెంకటేశ్వర్లు, తాడోజు పిచ్చయ్య, కట్ట మమత, జెట్టి శ్రీవాణిని ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని యోగా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ప్రసాద్‌, నవీన్‌, యాదయ్య, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి ఘనంగా సన్మానించారు.

రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి

దేవరకొండ : పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేలు పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివారం దేవరకొండ పట్టణంలో ఏర్పాటు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుకొచ్చిన ప్రధానమంత్రి పసల్‌బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో నాయకులు సుధాకర్‌, కేతావత్‌ లాలునాయక్‌, కర్నాటి సురేష్‌, రాములు, ఏటి కృష్ణ, వెంకటేష్‌, నర్సింహ, వెంకటేష్‌, గుండాల అంజయ్య, భాస్కర్‌, సహదేవ్‌, రవి తదితరులు ఉన్నారు

దర్వేశిపురం ఆలయం వద్ద నేడు వేలం1
1/1

దర్వేశిపురం ఆలయం వద్ద నేడు వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement