కనగల్: మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా జరిగింది. కనగల్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఒడి బియ్యం పోసి కానుకలు సమర్పించుకున్నారు. కల్యాణానికి ఆలయ ధర్మకర్తలు అక్కెనపల్లి తిరుమల్‌నాథ్, డాక్టర్ శ్రీనివాసరావు, వేణుగోపాలరావు, శ్రీనివాస్ చక్రవర్తి పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ వేడుకల్లో మాజీ సర్పంచులు నర్సింగ్ సునీత కృష్ణయ్యగౌడ్, నర్సింగ్ లలితశ్రీనివాస్‌గౌడ్, చిట్ల లింగయ్యగౌడ్, పందుల గోపాల్, వేముల పుష్పలత నరహరి, కనగల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు నర్సింగ్ లక్ష్మయ్యగౌడ్, నాయకులు నర్సింగ్ మురళిరాధిక, బెజవాడ శ్రీహరి, మట్టపల్లి వెంకన్న, ఒట్టె శంకర్, నర్సింగ్ లలిత, మన్మథ, నర్సింగ్ మధు, రాయల శ్రవణ్, నక్కల అశోక్, నర్సింగ్ వెంకన్న, ఓరుగంటి శంకరయ్య, దత్తయ్య ఆలయ అర్చకులు పాల్గొన్నారు.