పంచాయతీరాజ్‌లో ప్రత్యేక నియామకాలు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌లో ప్రత్యేక నియామకాలు

Mar 9 2025 1:33 AM | Updated on Mar 9 2025 1:31 AM

నల్లగొండ : పంచాయతీరాజ్‌ శాఖలో ప్రత్యేక నియామకాలు చేపడుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాల్లో.. సూపర్‌ న్యూమరరీ పోస్టుల ద్వారా జూనియర్‌ అసిస్టెంట్లను భర్తీ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పెద్ద చదువులు చదివి ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాల్లో చేకుండా జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న మేలు కలగనుంది. నియామకాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన శనివారం చేపట్టారు.

ఎళ్లుగా ఎదురుచూపులు

పంచాయతీరాజ్‌ శాఖలో ఉద్యోగులు చనిపోతే వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తారు. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో ఎక్కువ శాతం ఆఫీస్‌ సబార్డినేట్‌, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చనిపోయిన వారి పిల్లల్లో కొందరు ఇంజనీరింగ్‌, పీజీ ఈ పోస్టుల్లో జాయిన్‌ కాకుండా.. జూనియర్‌ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీ అయితే వాటిల్లో చేరేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే కొన్నాళ్లుగా ఏటా ఒకరిద్దరు పదవీవిరమణ పొందితే ఆ స్థాయిలోనే ముందు వరుసలో ఉన్న వారికి ఉద్యోగాలు వస్తున్నాయి. దీంతో కొందరు పదేళ్లకుపైగానే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు. ఇక.. కొందరు కుటుంబ పోషణ కోసం ఆఫీస్‌ సబార్డినేట్‌ విధుల్లో చేరుతున్నారు.

పదోన్నతులు లేకపోవడమే..

ప్రస్తుతం ఆఫీస్‌ సబార్డినేట్‌గా చేరినా.. పదోన్నతులు వస్తాయనే ఆశ లేదు. 20 ఏళ్లు గడిచిన వారికి కూడా జూనియర్‌ అసిస్టెంట్‌ పదోన్నతి లభించక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సబార్డినేట్‌, నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో సిబ్బంది లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో జిల్లా పరిషత్‌ సీఈఓలు, ఇతర అధికారులు, సంఘ నాయకులు కలిసి ప్రభుత్వానికి విన్నవించడంతో.. ప్రభుత్వం సూపర్‌ న్యూమరరీ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది.

59 పోస్టుల్లో జూనియర్‌ అసిస్టెంట్లు..

జిల్లాలో 59 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులను సూపర్‌ న్యూమరరీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రస్తుతం ఆఫీస్‌ సబార్డినేట్‌ ఖాళీల్లో సూపర్‌ న్యూమరరీ పద్ధతిలో జూనియర్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు ఇస్తుంది. ఈ సూపర్‌ న్యూమరరీ ద్వారా జూనియర్‌ అసిస్టెంట్లుగా చేరుతున్న వారిని భవిష్యత్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ రెగ్యులర్‌ పోస్టు ఖాళీ అయితే సీనియారిటీ ప్రకారం ఆ పోస్టుల్లోకి మార్చుతారు.

ఫ మొదటిసారిగా సూపర్‌ న్యూమరరీ పోస్టులు

ఫ ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యోగాల్లో.. జూనియర్‌ అసిస్టెంట్లుగా..

ఫ ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 59 మందికి మేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement