
సూర్యాపేటలోని జయ పాఠశాలలో స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు
సూర్యాపేటటౌన్: సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జయ పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయిలో నిర్వహించిన ‘స్పెల్ బీ, మ్యాథ్స్ బీ’ క్వార్టర్ ఫైనల్ పరీక్షలకు విశేష స్పందన లభించింది. ఈ స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలకు ప్రజెంటింగ్ స్పాన్సర్‌గా డ్యూక్స్ వ్యాపి, అసోసియేట్ స్పాన్సర్‌గా ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవహరిస్తున్నారు. ఈ పరీక్షలను నాలుగు కేటగిరీలలో నిర్వహించారు. కేటగిరీ–1లో 1, 2వ తరగతి విద్యార్థులు, కేటగిరీ–2లో 3, 4 తరగతులు, కేటగిరీ–3లో 5, 6, 7 తరగతుల విద్యార్థులు, కేటగిరీ–4లో 8, 9, 10 తరగతుల విద్యార్థులు పరీక్ష రాశారు. గత నెలలో స్పెల్ బీ పరీక్ష రాసి అర్హత సాధించిన విద్యార్థులు ఈ క్వార్టర్ ఫైనల్ పరీక్షలు రాశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు కోదాడలోని జయ పాఠశాల విద్యార్థులతో పాటు కోదాడలోని తేజ పాఠశాల విద్యార్థులు, మిర్యాలగూడలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్, వర్డ్ అండ్ డీడ్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో సాక్షి నల్లగొండ బ్రాంచ్ మేనేజర్ రుక్మాధర్, సాక్షి నల్లగొండ డిప్యూటీ మేనేజర్ నాగేశ్వర్‌రావు, ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ జయ వేణుగోపాల్, బింగి జ్యోతి, జెల్లా పద్మ, ఎండీ ఖలీం, జయరాజన్, బ్రహ్మారెడ్డి, సాక్షి అడ్వర్టైజ్‌మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్ వేములకొండ జానయ్య, సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ అనమాల యాకయ్య, సూర్యాపేట టౌన్ రిపోర్టర్ మాదగాని వేణు తదితరులు పాల్గొన్నారు.
స్పెల్ బీతో నైపుణ్యం పెరుగుతుంది
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పరీక్షలు విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. విద్యార్థులకు నైపుణ్యం పెరుగుతుంది. చదువుతో పాటు ఆంగ్ల పదాల అర్థాలు కూడా నేర్చుకుంటున్నారు. ఆంగ్ల భాష భవిష్యత్తులో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– జయరాజన్, ప్రిన్సిపాల్, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, మిర్యాలగూడ
ఎనిమిదేళ్లుగా పాల్గొంటున్నాం
సాక్షి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్ బీ పరీక్షలో తమ పాఠశాల నుంచి గత ఎనిమిదేళ్తుగా పాల్గొంటున్నాం. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఫైనల్‌కు వెళ్లాం. ఒకసారి రూ.25వేల నగదు బహుమతి, బంగారు పతకం తీసుకున్నాం. ఇలాంటి పరీక్ష నిర్వహిస్తున్న సాక్షి మీడియాకు ధన్యవాదాలు.
– ఎండీ. ఖలీం, ప్రిన్సిపాల్, వర్డ్ అండ్ డీడ్ ప్రైమరీ స్కూల్, మిర్యాలగూడ
చాలా కొత్త పదాలు నేర్చుకున్నా
సాక్షి మీడియా నిర్వహించిన స్పెల్ బీ పరీక్ష మూడో సారి రాస్తున్నాను. మొదటి లెవల్‌కు సెలెక్టయ్యి రెండో లెవల్‌లో పరీక్ష రాశాను. మూడో లెవల్‌కు వెళ్తానని చాలా ధీమాగా ఉంది. ఈ స్పెల్ బీ వలన వెయ్యి పదాలు నేర్చుకున్నారు. చాలా ఉపయోగకరంగా ఉంది.
– నిహారిక శర్మ, 9వ తరగతి,
లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, మిర్యాలగూడ
రెండోసారి ఎంపికయ్యా
స్పెల్ బీ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ పదాలపై అవగాహన వస్తుంది. నేను స్పెల్ బీ లెవల్–2కు ఎంపిక కావడం ఇది రెండోసారి. ఈ పరీక్ష రాయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరీక్షలో నేర్చుకునే ఇంగ్లిష్ ఎంతగానో ఉపయోగపడతాయి.
– ధాత్రి కృష్ణ, 9వ తరగతి,
జయ పాఠశాల, సూర్యాపేట
తప్పులు లేకుండా రాస్తున్నా
సాక్షి స్పెల్ బీ పరీక్షను ఎంతో సంతోషంగా రాశా. ఈ పరీక్ష రాయడం ద్వారా ఇంగ్లిష్ పదాలు చాలా నేర్చుకున్నాను. అలాగే తప్పులు లేకుండా పదాలు రాయగలుగుతున్నాను. మూడో లెవల్‌కు కూడా సెలక్టవుతా. పరీక్ష చాలా బాగా రాశా.
– జి.హర్ష, 4వ తరగతి, వర్డ్ అండ్ డీడ్
ప్రైమరీ స్కూల్, మిర్యాలగూడ
గణితం సులభంగా నేర్చుకోవచ్చు
మ్యాథ్స్ బీ పరీక్ష వలన గణితం సులభంగా నేర్చుకోగలుగుతున్నాం. ఈ పరీక్ష రాయడం వలన గణితంలో పట్టు సాధిస్తున్నాం. మా స్కూల్ నుంచి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ క్వార్టర్ ఫైనల్ పరీక్షల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.
– ఎం. బ్రహ్మారెడ్డి, గణిత ఉపాధ్యాయుడు, తేజ విద్యాలయం, కోదాడ
సూర్యాపేటలోని జయ పాఠశాలలో ఉమ్మడి జిల్లా స్థాయి క్వార్టర్
ఫైనల్ పరీక్షలు
ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం లభిస్తుంది
స్పెల్ బీ పరీక్షల వలన విద్యార్థులకు ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం లభిస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చెందుతాయి. ప్రతి సంవత్సరం మా పాఠశాల నుంచి చాలా మంది విద్యార్థులు సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీలో పాల్గొంటే ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు.
– బింగి జ్యోతి, డైరెక్టర్, జయ పాఠశాల, సూర్యాపేట








