
చిట్యాల: ఉరేసుకుని వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామానికి చెందిన రెగులగడ్డ కుమారస్వామికి మనుగోడు మండలం ఊకొండి గ్రామానికి చెందిన స్వాతి(28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిలులన్నారు. కాగా, వీరిద్దరు పిల్లలతో కలిసి కొంత కాలంగా చిట్యాలలోని సంతోష్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుమారస్వామి చిట్యాలలోని బార్ అండ్ రెస్టారెంట్‌లో పార్ట్‌నర్‌గా ఉండి విధులు నిర్వహిస్తున్నాడు.
స్వాతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంఘటన స్థలాన్ని నార్కట్‌పల్లి సీఐ మహేష్, చిట్యాల ఎస్‌ఐ రవి పరిశీలించారు. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై మంగళవారం రాత్రి వరకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.