కొల్లాపూర్: ఆశావర్కర్ల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వు అన్నారు. గురువారం ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ కొల్లాపూర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ.. ఆశావర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం చెల్లించడంతో పాటు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ప్రమాద బీమా, హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతిపత్రం సమర్పించగా.. ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివవర్మ, జ్యోతి, గౌరమ్మ, మాధవి, శివలీల పాల్గొన్నారు.
● పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జూపల్లి అన్నారు. కొల్లాపూర్ మండలం సోమశిలకు చెందిన పుట్టపాగ కృష్ణయ్య ఏడేళ్ల క్రితం ప్రమాదవశాత్తు కృష్ణానదిలో పడి మరణించాడు. ఆయన కుటుంబానికి ప్రభుత్వ నుంచి మంజూరైన రూ. 3లక్షల చెక్కును ఆయన అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ బన్సీలాల్, తహసీల్దార్ మాధవి, ఉపసర్పంచ్ ఖాదర్‌పాషా, రామకృష్ణ, గోరటి రామ్మోహన్, చిన్నకురుమయ్య, ఆశన్న, నర్సింహ, లింగన్న పాల్గొన్నారు.
రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు


