ఎఫ్‌ఆర్‌ఎస్‌ తర్వాతే కొత్త పింఛన్లు.. | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఆర్‌ఎస్‌ తర్వాతే కొత్త పింఛన్లు..

May 20 2026 11:25 AM | Updated on May 20 2026 11:25 AM

ప్రస్తుతం కొత్త పింఛన్లు ఇస్తారని చెబుతున్నా.. ఎప్పటి నుంచి అనేది ప్రకటించలేదు. జిల్లాలో అనర్హులతో పాటు చనిపోయిన వారి పింఛన్లు తొలగిస్తే.. కొత్త వారికి చోటు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మృతల పేరిట కూడా పింఛన్లు విడుదలవుతున్నాయని అధికారులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రక్రియ ద్వారా వారిని గుర్తించి తొలగిస్తే.. కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, 2022 ఆగస్టు నుంచి కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటికే జిల్లాలో చాలా మంది పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా వివిధ కారణాలతో వాటిని తిరస్కరించారు. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే పోర్టల్‌ క్లోజ్‌ చేయడంతో కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో నాలుగేళ్లుగా పింఛన్ల కోసం దరఖాస్తులు ఇస్తున్నారు తప్ప.. మంజూరు కావడం లేదు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

ప్రభుత్వ ఆదేశాల మేరకు చేయూత పింఛన్‌ లబ్ధిదారుల ఫేస్‌ రికగ్నేషన్‌ సిస్టం (ముఖ గుర్తింపు విధానం)చేపడుతున్నాం. ఆధార్‌ నంబర్‌ సహా లబ్ధిదారుల లైవ్‌ ఫొటోను నమోదు చేస్తారు. దీనిపై ఇప్పటికే జిల్లాకేంద్రంలో విడతల వారీగా పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. కొన్ని మండలాల్లో కార్యక్రమం మొదలైంది.

– చిన్న ఓబులేషు, డీఆర్డీఓ

Advertisement
 
Advertisement
Advertisement