కార్పొరేట్‌కు ఽధీటుగా సర్కారు వైద్యం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌కు ఽధీటుగా సర్కారు వైద్యం

May 17 2026 7:14 AM | Updated on May 17 2026 7:14 AM

రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్‌: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వం వైద్యసేవలు అందిస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కొల్లాపూర్‌లోని మాతాశిశు సంరక్షణ కేంద్రం, డయాలసిస్‌ సెంటర్‌లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వైద్యులు, సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతో పాటు సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వైద్యులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. అదే విధంగా ఎంసీహెచ్‌, డయాలసిస్‌ సెంటర్‌తో పాటు వంద పడకల ఆస్పత్రికి నిరంతర విద్యుత్‌ సరఫరా కోసం నూతనంగా ఏర్పాటుచేసిన ట్రాన్స్‌ఫార్మర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2018లో వంద పడకల ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని.. త్వరలోనే పనులను పూర్తిచేసి ఆస్పత్రిని ప్రారంభిస్తామన్నారు. ఆస్పత్రి భవనంలో వసతుల కల్పనకు రూ.కోటి నిధులు మంజూరు చేయించినట్లు వివరించారు. కొల్లాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎంసీహెచ్‌, డయాలసిస్‌ సెంటర్‌, వంద పడకల ఆస్పత్రులకు రోగులను తరలించేందుకు నాలుగు, ఐదు ఈవీ వాహనాలను ఏర్పాటుచేస్తామన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది కొరత అంశాలు తన దృష్టిలో ఉన్నాయని.. ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వస్తారని.. ఆయనకు సమస్యలను తెలియజేసి పూర్తిస్థాయి సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొల్లాపూర్‌ మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు రెగ్యులర్‌గా ఆస్పత్రిని పర్యవేక్షించాలని సూచించారు. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న అంబేడ్కర్‌ కళాభవన్‌ పనులను మంత్రి పరిశీలించారు. ఆయన వెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్‌ షేక్‌ రహీంపాషా తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement