అచ్చంపేటలో మిషన్ భగీరథ లీకేజీలమయం
●
వాళ్ల ఇష్టం వచ్చిన సమయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం, సాయంత్రం, రాత్రిపూట నల్లాలు వదలడంతో తెలియక పట్టుకోలేకపోతున్నాం. గతంలో కంటే ఎండాకాలం నీరు తక్కువగా వస్తోంది. లైన్‌మన్‌ను అడిగితే పైపులైన్ లీకేజీ ఉందని, పైనుంచి నీరు రావడం లేదని, ప్రైజర్ తక్కువగా ఉందని చెబుతున్నారు.
– బుద్దుల రామాంజనేయులు,
ఇందిరానగర్ కాలనీ, అచ్చంపేట
మా కాలనీకి మూడు, నాలుగు రోజులకు ఒకసారి నల్లాల ద్వారా నీరు వస్తోంది. అది కూడా 30 నిమిషాలకే బంద్ అవుతుంది. దీంతో తాగునీటి కోసం అవస్థలు పడుతున్నాం. పైపులైన్ల లీకేజీతో నల్లాల ద్వారా మురుగునీరు వస్తోంది. ఈ విషయంపై మున్సిపాలిటీ అధికారులు స్పందించాలి.
– నరేశ్, కుమ్మరివాడ, అచ్చంపేట
పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాం. లీకేజీలు ఏర్పడకుండా, నీరు వృథాగా పోకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాం. లీకేజీలకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయిస్తున్నాం. నీటి ఇబ్బంది ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. అమృత్ 2.0 పథకంలో భాగంగా పైపులైన్‌తో పాటు మరో మూడు ట్యాంక్‌ల నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా రూ. 16కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు వస్తే తప్ప నీటి సమస్య తీరదు.
– రాజానాయక్, మున్సిపల్ ఏఈ, అచ్చంపేట
అచ్చంపేట పట్టణ జనాభా:
37,506
వార్డులు:
20
పైపులైన్ పొడవు: 132 కి.మీ.
బ్యాలెన్సింగ్
ఓవర్‌హెడ్ ట్యాంకు: 1
బోరుమోటార్లు
80
వాటర్ డిమాండ్: 5 ఎంఎల్‌డీ
సరఫరా
అవుతున్న నీరు
3 ఎంఎల్‌డీ
అచ్చంపేట: వేసవిలో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. అచ్చంపేట మున్సిపాలిటీలో నీటి సమస్యకు చెక్ పెట్టేందుకు అధికారులు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించినప్పటికీ నీటి ఎద్దడి తీరడం లేదు. పట్టణం వేగంగా విస్తరిస్తున్నా నల్లా కనెక్షన్ల సంఖ్య మాత్రం అంతంతగానే ఉంది. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పవర్ బోర్లపై పట్టింపు కరువైంది. అవి తరచుగా కాలిపోవడం, మరమ్మతుకు గురికావడం వంటి సమస్యలు తలెత్తున్నాయి. మరోవైపు రోజు ఏదో ఒక ప్రాంతంలో తాగునీటి పైపులైన్ లీకేజీలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఆయా ప్రాంతాలకు ట్యాంకర్లతో చాలీచాలని నీటిని సరఫరా చేస్తుండటంతో అవస్థలు పడుతున్నారు. అచ్చంపేట పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలపై ‘సాక్షి’ ఫోకస్.
పట్టణంలో మూడు
రోజులకోసారి నీటి సరఫరా
శివారు కాలనీల్లో తీవ్ర సమస్య
వేసవి యాక్షన్ ప్లాన్ ఉన్నా తీరని తాగునీటి ఎద్దడి


