ఉప్పునుంతల: సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని అంబాత్రేయ క్షేత్ర పీఠాధిపతి ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన హిందూ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ జాతిని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్న నేపథ్యంలో హిందువులందరూ అప్రమత్తమై జాతి సంరక్షణకు నడుం బిగించాలన్నారు. హిందూ దేవాలయాలు, పురాతన సంస్కృతిని కాపాడుకుందామని అన్నారు. అందులో భాగంగా ఊరూరా హిందూ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ.. అందరిని సంఘటితం చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఉమ్మడి పాలమూరు విభాగ్ చాలక్ శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ మోహన్‌గౌడ్, బీజేపీ నాయకులు రమేశ్, మహేశ్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు పాల్గొన్నారు.


