సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర ఓటరు జాబితా సిద్ధం చేయాలి

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

అచ్చంపేట: 2002 ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుత ఓటర్లు మ్యాపింగ్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీఓ యాదగిరి కోరారు. మంగళవారం అచ్చంపేటలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన సర్‌–2002లో భాగంగా అచ్చంపేట మున్సిపల్‌ పరిధిలోని బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, స్పెషల్‌ టీం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకరించాలన్నారు. 2002 ఓటరు జాబితా ప్రకారం గుర్తించి మ్యాపింగ్‌ చేశామన్నారు. అచ్చంపేట తహసీల్దార్‌ సైదులు, మున్సిపల్‌ కమిషనర్‌ మురళి, డిప్యూటీ తహసీల్దార్లు బీష్వ, లక్ష్మణ్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement