ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం

May 13 2026 1:26 AM | Updated on May 13 2026 1:26 AM

కొల్లాపూర్‌: ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల సౌకర్యార్థం హైదరాబాద్‌కు చెందిన గుడ్‌ యూనివర్స్‌, ఆర్సేసియం సంస్థ సహకారంతో ఏర్పాటుచేసిన ఈవీ వాహనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. కొద్ది దూరం వాహనాన్ని స్వయంగా నడిపారు. అంతకు ముందు వైద్యసిబ్బందితో ఆయన సమావేశమై మాట్లాడారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. అదే విధంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలపై మంత్రి ఆరా తీశారు.

● రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. కొల్లాపూర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి వీసీలో పాల్గొన్న ఆయన.. నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల పరిధిలో ధాన్యం కొనుగోళ్లను వివరించారు. మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రెడ్డి జ్యోతి సత్యనారాయణ, వైస్‌చైర్మన్‌ రహీంపాషా, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.శ్రీనివాసులు, సంస్థ ప్రతినిధులు అనుష్క, వంశీ పాల్గొన్నారు.

రాష్ట్ర ఎకై ్సజ్‌,

పర్యాటకశాఖ మంత్రి

జూపల్లి కృష్ణారావు

Advertisement
 
Advertisement
Advertisement