● జిల్లాలో 18 పరీక్ష కేంద్రాల ఏర్పాటు
● హాజరుకానున్న 6,557మంది విద్యార్థులు
కందనూలు: జిల్లాలో బుధవారం నుంచి జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 18 కేంద్రాలను ఏర్పాటుచేశారు. మొదటి సంవత్సరం విద్యార్థులు 4,380 మంది, ద్వితీయ సంవత్సరం 1,727 మందితో కలిపి మొత్తం 6,557మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 18 మంది సీఎస్‌లు 18 మంది డీఓలను నియమించడంతో పాటు 1 సిట్టింగ్ స్క్వాడ్, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
సకాలంలో చేరుకోవాలి..
విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలని. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు. జిల్లాలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.
– వెంకటరమణ, డీఐఈఓ


