స్పందన అంతంతే.. | - | Sakshi
Sakshi News home page

స్పందన అంతంతే..

May 12 2026 1:14 AM | Updated on May 12 2026 1:14 AM

మున్సిపాలిటీలకు కలిసిరాని ‘ఎర్లీబర్డ్‌’ స్కీం

జిల్లాలో రాయితీపై కరువైన ప్రచారం

ఆసక్తిచూపని పట్టణవాసులు.. ముగిసిన గడువు

ముందస్తుగా చెల్లించింది రూ.3.66 కోట్లే

.............

బకాయిలు

పేరుకుపోకుండా..

మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోకుండా ఉండటంతోపాటు ఆదాయం సమకూర్చుకునేలా ప్రభుత్వం ముందస్తు పన్ను వసూళ్ల కోసం ఎర్లీబర్డ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ అవకాశం కల్పించింది. గత నెల 1 నుంచి 30 వరకు పన్ను చెల్లింపునకు గడువు విధించింది. మున్సిపల్‌ అధికారులు విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు వసూలు కోసం 6 ప్రత్యేక బృందాలు (బిల్‌ కలెక్టర్‌, అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్‌) ఏర్పాటు చేశారు. వీరితోపాటు మున్సిపల్‌ చైర్మన్లు, కమిషనర్లు స్వయంగా రంగంలోకి దిగి పలువురు వ్యాపారులకు అవగాహన కల్పించారు. వీరు ఉదయం, సాయంత్రం తమకు కేటాయించిన వార్డుల్లో తిరుగుతూ పన్నుల వసూళ్లకు యత్నించగా.. నాలుగు మున్సిపాలిటీల పరిధిలో రూ.3.66 కోట్లు వసూలయ్యాయి. గతేడాదితో పోల్చితే కేవలం రూ.5 లక్షలు మాత్రమే అదనంగా వచ్చాయి.

అచ్చంపేట: మున్సిపాలిటీల్లో ముందస్తు ఆస్తిపన్ను చెల్లింపుపై ఇచ్చిన రాయితీకి ప్రజల నుంచి ఆశించిన స్పందన లభించలేదు. 2026– 27 ఆర్థిక సంవత్సరానికి గాను మున్సిపల్‌శాఖ ముందస్తుగా పన్ను డిమాండ్‌ చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ వర్తింపజేసింది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పాత బకాయిలు లేని వారిని ఈ రాయితీకి అర్హులుగా ప్రకటించింది. ఏప్రిల్‌ 1 నుంచి అమలు చేసిన ఈ స్కీం గడువు అదే 30తో ముగిసింది. ఏటా నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎర్లీ బర్డ్‌ స్కీం జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపుదారులు కొందరు మాత్రమే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 6,888 అసెస్‌మెంట్లకు సంబంధించి యజమానులు పన్ను రూ.3.66 కోట్లు చెల్లించడంతో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరినట్లయింది.

ఈ స్కీం గడువుపై క్షేత్రస్థాయిలో ఆశించిన ప్రచారం లేకపోవడంతో పట్టణ ప్రజలు అంతగా ఆసక్తి చూపనట్లుగా తెలుస్తోంది. ఐదు శాతం రాయితీపై అవగాహన కల్పించాల్సిన యంత్రాంగం పెద్దగా పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతేడాది మున్సిపల్‌ కార్యాలయాలతోపాటు పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్లలో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. అలాగే మైక్‌తో కూడిన ఆటో ద్వారా ప్రచారం కల్పించారు. కానీ, ఈసారి అలాంటివి ఏమీ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో పన్ను వసూలు కాలేదని తెలుస్తోంది.

పట్టింపు లేని కారణంగానే..

Advertisement
 
Advertisement
Advertisement