జిల్లాలో సోమవారం నుంచి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి గృహాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేయనున్నారు. ఒక్కో బ్లాక్‌కు ఒక ఎన్యుమరేటర్‌ను నియమించాం. ప్రతిరోజు ఎన్యుమరేటర్ సేకరించే సమాచారం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. 6 నుంచి 7 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ ఉంటారు. జనగణన సమర్థవంతంగా నిర్వహించేందుకు మండలాల్లో తహసీల్దార్, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు చార్ట్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు.
– హేమంత కేశవ్ పాటిల్, కలెక్టర్
●


