ఇబ్బందులు రానివ్వం..
అచ్చంపేట రూరల్: పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంతో పాటు సేవల్లో వేగం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ–పంచాయతీకి శ్రీకారం చుట్టింది. పంచాయతీల ద్వారా పౌర సేవలు అందించాలని 2015లో కంప్యూటర్లను పంపిణీ చేయగా.. ప్రస్తుతం వృథాగా మారాయి. టీఫైబర్ ద్వారా పంచాయతీల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించినా.. పర్యవేక్షణ కొరవడి లక్ష్యం నీరుగారుతోంది. ఫలితంగా ప్రజలకు సేవలు అందని పరిస్థితి నెలకొంది.
మండల కార్యాలయానికే పరుగులు..
పంచాయతీ భవనాలకు తెలంగాణ ఫైబర్ నెట్ సంస్థ ఓఎఫ్‌సీ, బీఎస్‌ఎన్‌ఎల్ లైన్ వేసి నెట్ సదుపాయం కల్పించింది. సర్వర్ ప్యానల్ బాక్సులు, సోలార్ ఎనర్జీ పాయింట్లను ఏర్పాటు చేశారు. అయితే ఇవి పని చేయకపోవడంతో ప్రజలు ఏ చిన్న పని కోసమైనా మండల కార్యాలయాలకే పరుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. జనన, మరణ ధ్రువపత్రాల కోసం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. మృతిచెందిన వారి ధ్రువీకరణపత్రాల కోసం కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీల్లో వీటిని పొందేలా చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆపరేటర్లు లేక..
జిల్లావ్యాప్తంగా 460 గ్రామాలు ఉండగా.. అన్నిచోట్ల ఈ–పంచాయతీలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో పంచాయతీకి ఒక కంప్యూటర్, స్కానర్, ప్రింటర్ తదితర సామగ్రిని పంపిణీ చేసినా.. ఆపరేటర్లను నియమించకపోవడంతో అవి పని చేయడం లేదు. జనన, మరణ ధ్రువపత్రాలు, ట్రేడ్ లైసెన్సుల జారీ, వసూలు చేసిన ఆస్తి పన్నుల రసీదులు, అభివృద్ధి పనులకు వెచ్చించిన నిధుల వ్యయం వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ఆన్‌లైన్ సదుపాయం లేక కార్యదర్శులే ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లి అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండల కేంద్రాల్లో 51 మంది ఆపరేటర్లు పని చేస్తున్నారు. గతంలో మంజూరైన కంప్యూటర్లతోనే కాలం గడుపుతున్నారు. మొరాయిస్తే వాటినే రిపేర్లు చేసి నడిపిస్తున్నారు.
అచ్చంపేట మండలం హాజీపూర్
గ్రామ పంచాయతీ కార్యాలయం
పల్లె ప్రజలకు
పౌర సేవలు దూరం
పంచాయతీల్లో ప్రజలకు తప్పని తిప్పలు
జిల్లాలోని ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 460 గ్రామాలు ఈ–పంచాయతీలుగానే ఉన్నా యి. జనన, మరణ ధ్రువపత్రాల కోసం లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. మండల కేంద్రాల్లో వాటిని పొందుతున్నారు. ఆయా మండల కేంద్రాల్లో 51 మంది ఆపరేటర్లు అందుబాటులో ఉన్నారు.
– శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి


