మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

May 10 2026 8:10 AM | Updated on May 10 2026 8:10 AM

కల్వకుర్తి రూరల్‌: ప్రభుత్వం వెంటనే మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టి రైతులను ఆదుకోవాలని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వార్ల వెంకటయ్య అన్నారు. శనివారం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మొక్కజొన్న రైతులతో ముఖాముఖి మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కజొన్న క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు సరిగా జరపడం లేదన్నారు. రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులు దాపురించాయని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష ఎకరాలకు పైగా సాగైన మొక్కజొన్న సగానికి పైగా ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోతుందన్నారు. దళారులు, కమీషన్‌ ఏజెంట్లు మార్కెట్‌ అధికారులతో కుమ్మకై ్క రైతుల దగ్గర కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధర పొందుతున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పరశురాములు, అశోక్‌, తిరుపతయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement