పోలీస్ విధి నిర్వహణలో బాధ్యతలు నిర్వర్తిస్తూనే పిల్లలతో ప్రత్యేకంగా సమయం కేటాయిస్తాను. ఒకవైపు విధులు, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేందుకు సమయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. సమాజంలో ప్రస్తుత పరిస్థితులను వారికి అర్థమయ్యేలా చెబుతూ వారితో ఫ్రెండ్లీగా ఉంటాను. డ్యూటీలో బిజీగా ఉంటున్నా పిల్లలు అర్థంచేసుకుని సర్దుకుంటున్నారు. తల్లులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు
– విజయలక్ష్మి, ఏఎస్‌ఐ,
షీ టీం ఇన్‌చార్జి, నాగర్‌కర్నూల్


