అక్రమాలకు చెక్!
● ఎన్‌ఎంఎంఎస్ యాప్‌తో
ఉపాధి హామీ పనుల్లో పారదర్శకత
● జిల్లాలో 1,67,197 జాబ్‌కార్డులు.. 1,67,290 మంది కూలీలు
–8లో u
సోమవారం శ్రీ 30 శ్రీ మార్చి శ్రీ 2026
అచ్చంపేట రూరల్: స్వగ్రామాల్లోనే కూలీలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో అమలుచేస్తున్న ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. పని ప్రదేశంలో జరిగే అవకతవకలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక ఎన్‌ఎంఎంఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా అక్ర మ మస్టర్లకు అడ్డుకట్ట పడింది. ఇదివరకే కూలీలందరికీ ఈకేవైసీ పూర్తిచేశారు. జాబ్‌కార్డుల్లో ఉండే వారి ఐరిస్‌తో పాటు వివరాలను నమోదు చేసుకున్నారు. సంబంధిత యాప్‌లో ముందుగా సంబంధిత పనిప్రదేశాన్ని ఫొటో తీయాల్సి ఉంటుంది. పని ముగిసిన అనంతరం హాజరైన వారందరితో మరో ఫొటో తీసుకుంటారు. ప్రతిఒక్కరి ఈకేవైసీ పూర్తయినందున జాబ్‌కార్డులో ఉన్నవారి ఫొటో మాత్రమే యాప్ ఆమోదిస్తుంది.
తప్పని అడ్డంకులు..
ఉపాధిహామీ పథకంలో అక్రమా లను అరికట్టేందుకు ఎన్‌ఎంఎంఎస్ యాప్‌లో ముఖగుర్తింపు హాజరు విధానానికి ఆదిలోనే అడ్డంకులు ఏర్పడుతున్నాయి. యాప్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో కూలీల ముఖగుర్తింపు హాజరు నమోదు సాధ్యం కావడం లేదు. గతంలో కూలీల మస్టర్ విధానం అమలులో ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 2 నుంచి ముఖగుర్తింపు హాజరు ప్రవేశపెట్టింది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉదయం, మధ్యాహ్నం కూలీల హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్త విధానంపై ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లకు ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడంతో క్షేత్రస్థాయిలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో కూలీ ముఖ హాజరు నమోదు చేసేందుకు సుమారు 5 నిమిషాల వరకు పడుతుండటంతో హాజరుకే సమయం సరిపోతుందని ఫీల్డ్ అసిస్టెంట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒక్క రోజులో సుమారు 70నుంచి 80మంది కూలీల ముఖ హాజరును రెండు పర్యాయాలు ఎలా నమోదు చేయాలో తెలియడంలేదని వాపోతున్నారు.
రేపటి నుంచే శనేశ్వరుడి బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్‌రావు, అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి తెలిపారు. మొదటి రోజు శివుడికి రుద్రాభిషేకం, బిల్వార్చన, శివపార్వతుల కల్యాణం, రెండో రోజు జైష్ట్యాదేవి సమేత శనేశ్వరుడి కల్యాణం, చివరి రోజు ఉమామహేశ్వరస్వామి వ్రతం, రుద్రహోమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
సలేశ్వరం జాతరకు ప్రత్యేక బస్సులు
కందనూలు: నల్లమల అటవీ ప్రాంతంలో మూడు రోజులపాటు జరిగే సలేశ్వరం జాతరకు జిల్లాకేంద్రం నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్న ట్లు నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. ఆదివారం ఆర్టీసీ డిపోలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సలేశ్వరం జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు నాగర్‌కర్నూల్ డిపో నుంచి 25 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది సుమారు 12వేల మంది భక్తులు ప్ర యాణించారని.. ఈసారి 15వేల మంది ప్రయాణిస్తారని అంచనా వే స్తున్నామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి సలేశ్వరం జాతరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున.. వారికి రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నా రు. సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్ జోగమ్మ, ట్రాఫిక్ మేనేజర్ యాదయ్య తదితరులు ఉన్నారు.


