క్షయ నిర్మూలనే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షయ నిర్మూలనే లక్ష్యం

Mar 25 2026 8:03 AM | Updated on Mar 25 2026 8:03 AM

వెల్దండ: క్షయవ్యాధి నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కె.రవికుమార్‌ అన్నారు. ప్రధానమంత్రి టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌లో భాగంగా మంగళవారం వెల్దండ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 86 హైరిస్క్‌ గ్రామాలను గుర్తించి.. జూలై 2వ తేదీ వరకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసే ప్రత్యేక శిబిరాల్లో 14 ఏళ్లు పైబడిన వారికి ఎక్స్‌రే, ఇతర పరీక్షల ద్వారా ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి.. సంపూర్ణ చికిత్స అందించడం వల్ల వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అనంతరం పలువురికి నిర్ధారణ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా.భీమానాయక్‌, మండల వైద్యాధికారి సింధు, డీపీఎంఓ ఆజాద్‌, సర్పంచ్‌ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడు, ఉపసర్పంచ్‌ శ్రీనివాసులు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ రాధ, సూపర్‌వైజర్లు మురళి, మనోజ్‌కుమార్‌, ప్రమోద్‌, లక్ష్మణ్‌, గోవర్ధన్‌ పాల్గొన్నారు.

నాణ్యమైన భోజనం అందించాలి

కందనూలు: విద్యార్థులకు నాణ్యమైన భోజ నం అందించాలని డీఈ ఓ రమేష్‌కుమార్‌ అన్నా రు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ పరిధిలోని దేశిటిక్యాల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల పాఠ్యాంశ సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement