
విద్యారంగంలో సేవకు..
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: మహబూబ్‌నగర్‌లోని ఎంబీసీ (ఎయిడెడ్) పాఠశాల హెచ్‌ఎంగా విధులు నిర్వహిస్తున్న జగదీశ్వర్‌రెడ్డి కొన్నేళ్లుగా విద్యారంగంలో చేస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డును ప్రకటించింది. ఈ మేరకు పాఠశాలలో ఎస్సెస్సీ విద్యార్థులు ఉత్తీర్ణత శాతం పెంచడం, వనరులు అరకొర ఉన్నప్పటికీ విద్యార్థులు పాఠశాల యాజమాన్యం సహాయ, సహకారాలతో మెరుగైన విద్య అందించడంలో తనదైన పాత్ర పోషించారు. విద్యార్థులకు కావాల్సిన వసతులు, వనరులు సమకూర్చడంలో పూర్వ విద్యార్థులు, తోటి ఉపాధ్యాయుల సహకారంతో ఆర్వోప్లాంట్, బోర్, డ్యూయెల్ డెస్కుల్, బోర్డులు సమకూర్చారు.
సమాజ సేవ చేస్తాం
ప్రభుత్వం ఉత్తమ అవార్డు ఇవ్వడంతో బాధ్యత పెరిగింది. దీని ద్వారా మరింత సమాజ సేవ, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు కృషిచేస్తా. పేద విద్యార్థులకు అన్నిసౌకర్యాలతో కూడిన విద్య అందించే దిశగా అడుగులు వేస్తాం. ఇందుకు సహకరించిన డీఈఓ ప్రవీణ్‌కుమార్, పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు.
– జగదీశ్వర్‌రెడ్డి, ఎంబీసీ పాఠశాల హెచ్‌ఎం