
గురుభ్యోనమః
– సాక్షి, నాగర్‌కర్నూల్
● బోధనతోపాటు ఆటపాటల్లోనూ ప్రోత్సాహం అందిస్తున్న పలువురు ఉపాధ్యాయులు
● నూతన ఆవిష్కరణలు, సైన్స్ వైపు మరల్చేందుకు కృషి
● బడుల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక దృష్టి
ప్రతి ఒక్కరి నడవడిక, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే దార్శనికులు గురువు. అజ్ఞానపు చీకట్లను తొలగిస్తూ.. వెలుగుల జ్ఞానాన్ని ప్రసరింపజేసే ప్రత్యక్ష దైవం గురువు.
ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు నైతిక విలువలతోపాటు క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
బడికి దూరంగా ఉన్న పిల్లలను బడిలో చేర్పిస్తూ.. బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుతున్నారు. శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..