నేడు రేషన్‌ దుకాణాలు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు రేషన్‌ దుకాణాలు బంద్‌

Sep 5 2025 11:55 AM | Updated on Sep 5 2025 11:55 AM

నేడు

నేడు రేషన్‌ దుకాణాలు బంద్‌

నాగరకర్నూల్‌: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం జిల్లాలోని రేషన్‌ దుకాణాలను మూసివేస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షుడు సాధిక్‌పాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కనీస గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్‌ పెంచాలని, డీలర్లు పంపిణీ చేసిన 5 నెలల కేంద్ర ప్రభుత్వ బియ్యం కమీషన్‌ డబ్బులు చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరు కాకుండా ఒకే కమీషన్‌ ఎప్పటికప్పుడు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తమ ఆవేదనను ప్రభుత్వానికి శాంతియుతంగా తెలిపేందుకు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాల బంద్‌ చేస్తున్నామన్నారు.

దరఖాస్తుల ఆహ్వానం

కందనూలు: హైదరాబాద్‌లోని జింఖానా మైదానంలో ఈ నెల 9 నుంచి 10 వరకు నిర్వహించే రాష్ట్రస్థాయి సివిల్‌ సర్వీసెస్‌ క్రీడల్లో పాల్గొనేందుకు ఆసక్తి గల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు శనివారం వరకు దరఖాస్తు చేసుకోవాలని డీవైఎస్‌ఓ సీతారాం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అథ్లెటిక్స్‌, వాలీబాల్‌, బ్యాట్మింటన్‌, క్రికెట్‌, చెస్‌, క్యారమ్స్‌, ఫుట్‌బాల్‌, హాకీ, కబడ్డీ, లాన్‌ టెన్నీస్‌, పవర్‌ లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, టేబుల్‌ టెన్నీస్‌, వాలీబాల్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌, టెస్ట్‌ ఫిసిక్‌, యోగా, ఖోఖో తదితర వాటిలో పాల్గొనే అభ్యర్థులు ఉద్యోగ గుర్తింపుతోపాటు ఆధార్‌ కార్డుతో కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు.

వైభవంగా వట్టెం

వెంకన్న పవిత్రోత్సవాలు

బిజినేపల్లి: మండలంలోని వట్టెం వెంకన్న ఆలయంలో శ్రీమదర్మేల్‌ మంగ గోదాదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు చతుస్థానార్చన, పూర్ణాహుతి, పవిత్ర మాలధారణ చేపట్టారు. ఈ ఉత్సవాలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కనుల పండువగా కొనసాగాయి.

కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలు

నాగర్‌కర్నూల్‌ రూరల్‌: రాష్ట్రవ్యాప్తంగా కార్మికుల హక్కుల సాధన కోసం సమరశీల పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయలక్ష్మి అన్నారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ప్యాక్టర్‌ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్‌కోడ్లు తీసుకురావడం కార్మికుల హక్కులను హరించడమే అన్నారు. నాలుగు లేబర్‌ కోడ్సు వల్ల కార్మికులకు 8 గంటల పని విధానం పోయి 12 గంటలకు పెరుగుతుందన్నారు. జిల్లాలో కార్మిక యాజమన్యాలు వెట్టి చాకిరి చేయిస్తున్నారని, కార్మిక చట్టాలు ఎక్కడా అమలు కావడం లేదని విమర్శించారు. వెంటనే స్కీం వర్కర్లను పర్మనెంట్‌ చేయాలని, పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాల జీఓలను గెజిట్‌ చేసి రూ.26 వేల వేతనం ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు పర్వతాలు, రామయ్య, శంకర్‌నాయక్‌, శివవర్మ, దశరథం, శివరాములు, వెంకటయ్య, బాలస్వామి తదితరలు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి అంగీకారం

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: రీజియన్‌లో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఆర్‌ఎం సంతో ష్‌కుమార్‌ అంగీకరించారని ఆర్టీసీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ ఫోరం అధ్యక్షుడు రాజసింహుడు, నాయకులు జె.ఎన్‌.రెడ్డి, భగవంతు తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌లో కోత విధించిన 30 శాతం ఆదాయపు పన్ను తిరిగి చెల్లించేందుకు ఒప్పుకొన్నారన్నారు. ఎలక్ట్రికల్‌ డీలక్స్‌ బస్సుల్లో రిటైర్డ్‌ ఉద్యోగుల భార్యాభర్తల ప్రయాణ ం, ఆర్టీసీ క్లినిక్‌లో ల్యాబ్‌ టెక్నీ షియన్‌ నియామకానికి, మందుల సరఫరాకు అంగీకరించారన్నారు. సంఘం నాయకులు రామాంజనేయులు, అంజన్న, మనోహర్‌, రియాజొద్దీన్‌, బుచ్చన్న పాల్గొన్నారు.

నేడు రేషన్‌  దుకాణాలు బంద్‌ 
1
1/1

నేడు రేషన్‌ దుకాణాలు బంద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement