
ఆవిష్కరణల వైపు అడుగులు..
చిన్నముద్దునూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు రాజశేఖరరావు సైన్స్ టీచర్‌గా పాఠాలు చెబుతూనే.. విద్యార్థులకు నిజ జీవితంలోనూ సమస్యలకు పరిష్కారం చూపేలా ఆవిష్కరణల వైపు అడుగులు వేయిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఔషధ మొక్కల ఆకుల చూర్ణంతో కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేసే విధానాన్ని ఆవిష్కరించారు. ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్‌లో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. మానవుని మెదడు ఆకృతిని వర్ణించేందుకు హెల్మెట్ రూపంలో మోడల్ తయారు చేసి విద్యార్థులకు బోధిస్తున్నారు. వినూత్న పద్ధతిలో పాఠాలు చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.