
కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
కోడేరు: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్య పెంచాలని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ డిప్యూటీ సెక్రటరీ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ విశ్వేశ్వర్ అన్నారు. గురువారం కోడేరు జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. అనంతరం అధ్యాపకులతో ఆయన సమావేశమై మాట్లాడారు. నీట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సమర్థవంతంగా సిద్ధం చేయాలన్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా అధ్యాపకులు పనిచేయాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు. ఆయన వెంట వైస్ ప్రిన్సిపాల్ పద్మావతి, పస్పుల శ్రీధర్‌బాబు తదితరులు ఉన్నారు.